
552views
న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్టు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్ విదేశాంగ శాఖ అభివర్ణించింది.
2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం మోదీ తొలిసారిగా ఆదివారం అక్కడ పర్యటించారు.. ఈ సందర్భంగా చీనాబ్ నదిపై రెండు జల విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీన్ని కూడా పాక్ తప్పుపట్టింది.
ఆ ప్రాజెక్టులపై పాక్‌కు ఆభ్యంతరాలున్నాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని భారత్ తమతో పంచుకోలేదని పేర్కొంది. అక్కడ శంకుస్థాపనలు చేయడం ద్వారా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది.





