News

దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులు జాగృతం కావాలి

667views
  • ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రాంత ప్ర‌చార‌క్ భ‌ర‌త్ కుమార్‌

క‌విటి: దేశ సమగ్రత, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్న దుష్టశక్తుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు హిందూ స‌మాజం ఐక్యత కావాల‌ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్(ఆర్.ఎస్‌.ఎస్‌) ప్రాంత ప్ర‌చార‌క్ భ‌ర‌త్ కుమార్ పిలుపునిచ్చారు. ఏపీలోని క‌విటిలో ఆదివారం జ‌రిగిన హైంద‌వ శంఖారావానికి ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌రై, మాట్లాడారు.

స్వదేశీ, స్వావ లంబన, స్వధర్మం, ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. ప్రధానంగా యువతలో జాతీయభావం అలవడాలని, అదే నిష్ఠైన దేశ‌భ‌క్తి అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌విటి, ఇచ్ఛాపురం మండ‌లాల స్వ‌యం సేవ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి