News

బెంగళూరులో బైబిల్ చదవాలని విద్యార్థుల‌పై వత్తిడి!

426views
  • హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్‌గౌడ ఆరోప‌ణ‌

బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో హిజాబ్ తర్వాత మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ విద్యార్థులను పవిత్ర గ్రంథం బైబిల్‌ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకుంది.

ఈ కొత్త ఆదేశం కర్ణాటక విద్యా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఉందని కొన్ని హిందూ సమూహాల నుంచి ప్రతిస్పందనలు వచ్చాయి. అంతేకాదు, విద్యార్థులు తప్పనిసరిగా తమ పాఠ్యపుస్తకాలతో పాటు బైబిల్ ప్రతిని తమతో ప్రతి రోజు తప్పనిసరిగా పాఠశాలకు తీసుకు వెళ్ళవలసిందే.

పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులను బైబిల్ చదవాలని ఒత్తిడి చేస్తున్నారని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్‌గౌడ ఆరోపించారు. పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులు కూడా ఉన్నారని, వారిపై బైబిల్‌లోని బోధనలను బలవంతంగా నేర్చుకునేలా ఒత్తిడి చేస్తున్నారని హిందూ జన జాగృతి పేర్కొంది.

“ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 & 30 ఉల్లంఘన. విద్యా సంస్థలు ఏ విద్యార్థులపైనా మతపరమైన బోధనలను అమలు చేయకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి” అని మోహన్ గౌడ స్పష్టం చేశారు.

చాలా సంవత్సరాలుగా ఈ ఆచారం అక్కడ ఉందని చాలా మంది క్రైస్తవ మత పెద్దలు పేర్కొన్నారు. బిషప్ ఆఫ్ సౌత్ ఇండియా రెవ. డాక్టర్ ప్రసన కుమార్ శామ్యూల్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, “క్లారెన్స్ పాఠశాలల్లో బైబిల్ చదవాలనే ఒత్తిడి చాలా కాలంగా ఉంది, ఇది ఇప్పుడు కొత్తది కాదు.

వారు దానిని ఆ సంస్థలో ఎందుకు తప్పనిసరి చేస్తున్నారో మాకు తెలియదు. ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువుల తల్లిదండ్రులు అందరూ బైబిల్ తీసుకుని, బైబిల్ చదువుతామని హామీ ఇచ్చారు” అని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి