News

పుల్వామాలో భారీ ఎన్ కౌంట‌ర్‌: లష్కరే తోయిబా ముఖ్య ఉగ్రవాది హతం

481views

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తోయిబాకు డిప్యూటీ కమాండర్​ ఇన్​ చీఫ్​ ఆరిఫ్​ హజార్​ సహా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని సైనికాధికారులు తెలిపారు.

తొలుత పుల్వామాలోని పాహు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన బలగాలు​.. వారికి దీటుగా బదులిచ్చి ముగ్గురు ముష్కరులను కాల్చిచంపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి