News

రామతీర్థం ఆలయ పునఃప్రతిష్ఠ‌

665views

నెల్లిమ‌ర్ల‌: విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన రామతీర్థం కోదండ రామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. రుత్వికులు నీలాచలం కొండపై స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2020 డిసెంబర్‌లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆలయాన్ని పునఃనిర్మించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు గైర్హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి