News

దేవాలయాల్లో అధికారుల అవినీతి వాస్తవమే… ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

524views

విజయవాడ: రాష్ట్ర దేవాదాయశాఖలో అవినీతి ఉన్నమాట వాస్తవమేనని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడలో దేవదాయశాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దేవాలయాల్లో అవినీతి ఉన్నది నిజమేనని.. దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

ఇక నుంచి అన్ని దేవాలయాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వీఐపీలను ఒకేసారి పక్కనపెట్టడం సాధ్యం కాదని చెప్పిన మంత్రి.. ఆలయాల్లో ఏళ్ళ‌ తరబడి పాతుకుపోయిన సిబ్బందిని కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అటు.. దుర్గ గుడిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి