News

సిక్కు గురువు తేజ్ బహదూర్ జయంతి… ఎర్ర కోట నుండి ప్రసంగించనున్న మోడీ

406views

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్​ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్​ బహదూర్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది.

సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. నరేంద్ర మోదీ గురువారం అదే తరహాలో ప్రసంగించనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులు ‘షాబాద్ కీర్తన’ చేస్తారని తెలిపింది కేంద్ర సాంస్కృతిక శాఖ. దిల్లీ గురుద్వారా మేనేజమెంట్ సహకారంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి