News

నమాజ్ స‌మ‌యంలో హనుమాన్ చాలీసా వినిపించకూడదు… మహారాష్ట్ర పోలీసుల వింత పోకడలు

574views

ముంబై: ముస్లింలు ప్రార్థన చేసే సమయం ఆజాన్​(నమాజ్​)కు 15 నిమిషాల ముందు నుంచి నమాజ్​ తర్వాత 15 నిమిషాల వరకు హనుమాన్​ చాలీసా, భజన వంటివి లౌడ్​స్పీకర్లలో ప్లే చేయకూడదని మహారాష్ట్ర పోలీసులు ఆదేశించారు. స్పీకర్లు పెట్టేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిటీ పోలీస్​ కమిషనరేట్​ ఆదేశాలు జారీ చేసింది.

మే మూడోతేదీలోపు అన్ని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్​స్పీకర్లు పెట్టుకునేందుకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా స్పీకర్లు పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలా చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

మరోవైపు.. నమాజ్​ కోసం మసీదుల్లో లౌడ్​స్పీకర్లును తొలగించకపోతే.. తాము హనుమాన్​ చాలీసా, భజనలతో లౌడ్​స్పీకర్లు ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్​​ సేన(ఎంఎన్​ఎస్​) అధినేత రాజ్​ ఠాక్రే హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే మసీదు సమీపంలో లౌడ్​స్పీకర్​లో హనుమాన్​ చాలీసా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ఎంఎన్​ఎస్​ నాయకుడు మహేంద్ర భనుశాలిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి