
517views
తిరువనంతపురం: కేరళ కాసర్గోడ్లో సంప్రదాయ ఒట్టెకోలా వేడుకలు ఘనంగా జరిగాయి. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గువేందపాడ్పు గ్రామస్థులు వేడుకలు చేసుకున్నారు. గ్రామంలో ఓ చోట భారీ ఎత్తున దుంగలను కాల్చి.. ఆ నిప్పులపై భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. ఇలా చేస్తే తమ ఆరోగ్యానికి మంచి జరుగుతుందని స్థానికులు విశ్వసిస్తుంటారు.





