News

అక్బరుద్దీన్‌ కేసు కొట్టివేతపై అప్పీల్‌కు బీజేపీ డిమాండ్

596views
  • సాక్ష్యాలు బలంగా ఉన్నా నిర్దోషిగా ఎలా తెలుస్తారంటూ ప్రశ్న

భాగ్య‌న‌గ‌రం: అక్బరుద్దీన్‌పై కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే అప్పీల్‌కు వెళ్ళాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రంచమంతా చూసిందని, అయినా ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. న్యాయస్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుమ్మక్కయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి