
573views
న్యూఢిల్లీ: ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారతీయ భాషలోనే ఉండాలని, స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
పార్లమెంటరీ అధికార భాషా కమిటీ అధ్యక్షుడిగా ఉన్న షా, కేంద్ర మంత్రివర్గం 70 శాతం ఎజెండా ఇప్పుడు హిందీలో తయారు చేస్తున్నట్టు సభ్యులకు తెలిపారు. దేశ ఐక్యతలో అధికార భాషను ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.
స్థానిక భాషలకు కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని షా సూచించారు. ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మార్చితే తప్ప, ప్రచారం జరగదని ఆయన పేర్కొన్నారు.
Source: Nijamtoday





