News

ముస్లిం పండ్ల వ్యాపారాల‌ను బహిష్కరించాలి

457views
  • కర్ణాటకలో పెరుగుతున్న డిమాండ్

బెంగ‌ళూరు: కర్ణాటకలో పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కో ఆర్డినేటర్ చంద్రు మోగేర్ కోరారు.

హిందువులంతా హిందూ విక్రేతల నుంచి పండ్లను కొనుగోలు చేయాలని మోగేర్ ట్విట్టరులో కోరారు.‘‘పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని హిందువులను అభ్యర్థిస్తున్నాను’’ అని మోగేర్ కోరారు.

హిందూ నాయకుడు ప్రశాంత్ సంబర్గి ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించడంపై తన ఆలోచనలను పంచుకున్నారు. పండ్ల వ్యాపారంలో ముస్లిం విక్రేతలను తీసివేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ సంబర్గి కోరారు. పండ్ల వ్యాపారానికి పెద్ద మార్కెట్‌ ఉందని, మధ్యవర్తులను తొలగించడం ద్వారా రైతులు తమ దిగుబడికి సముచితమైన ధరలు పొందుతారని రైతులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యం అని ప్రశాంత్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి