
577views
న్యూఢిల్లీ: దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్య 100కు చేరిందని, ఈ తరుణంలో ఈ వేడుకలను జరుపుకొంటున్నామని చెప్పారు.
బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా నేడు మనం జన సంఘ్ శకాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఆ రోజుల్లో నూనె దీపాలను పట్టుకుని నడిచినవారిని, ఆ తర్వాత కమలంతో నడుస్తున్నవారిని గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీని వైభవోపేతంగా తీర్చిదిద్దడం కోసం మూడు, నాలుగు తరాలవారు తమ జీవితాలను అంకితం చేశారని చెప్పారు.





