
500views
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే విధానం రెండేళ్ళ విరామం తరువాత గురువారం ప్రారంభమైనది. ఇందుకోసం సిఆర్‌వో జనరల్ కౌంటర్లలో ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా 2020, మార్చి 20న శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేయడంతోపాటు ఆర్జిత సేవల కేటాయింపును నిలిపివేశారు. దాదాపు రెండేళ్ళ తరువాత ఈ విధానాన్ని టిటిడి తిరిగి ప్రారంభించింది.
Source: Nijamtoday





