
570views
-
మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశించిన ధర్మాసనం.. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్టు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్ 19న కేసు వాదనలు వింటామని, అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని, తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వేయిదా వేసింది.
Source: EtvBharat





