News

జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

540views

ఇస్లామాబాద్: ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు నాలుగు రోజుల ముందుగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారు. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ మూడోతేదీన‌ పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది.

ఈ నేపథ్యంలోనే కీలక భాగస్వామ్య పక్షమైన ఎమ్‌క్యూఎమ్‌ బుధవారం సంకీర్ణం నుండి నిష్క్రమించింది. ప్రతిపక్షానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాక్ జాతీయ అసెంబ్లీలో విపక్షాల బలం 176కు పెరిగింది. అధికార కూటమి బలం 164కు పడిపోయింది. దీంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మెజార్టీ కోల్పోయారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి