News

స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

604views

కర్నూలు: నంద్యాల, సంఘమిత్ర ఆవాసంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం(షహీద్ దివస్) జరిగింది. సంఘ‌మిత్ర ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా, సేవా భారతి సహకార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ప్రధాన వక్త, కార్యవర్గ సభ్యుడు ఈ వెంకటయ్య వేదిక నలంకరించగా, జ్యోతిప్రజ్వలన, మాలార్పణ, ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది.

వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో ఎంతో ప్రభావం చూపి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివరామ్ రాజ్‌గురు జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. అలాగే త‌మ‌ జీవితాలను ఉన్నతంగా మలచుకొని దేశం కోసం, ధర్మం కోసం నిలిచి పోరాడే యోధులుగా తయారవ్వాలని చిన్నారులకు పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి