News

బీర్‌భూమ్ ఘ‌ట‌న‌లో టీఎంసీ నేత అనరుల్ హొస్సేన్ అరెస్టు!

536views

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌, బీర్‌భూమ్ జిల్లా, బొగ్తుయ్ గ్రామంలోని రాంపూర్‌హట్ ప్రాంతంలో జరిగిన గ‌డ్డి ఇళ్ళు కాల్చివేత ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు గురువారం(మార్చి 24) అనరుల్ హొస్సేన్ అనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. రాంపూర్‌హ‌ట్ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది స‌జీవ ద‌హ‌నమైన సంగ‌తి తెలిసిందే.

అందిన స‌మాచారం ప్ర‌కారం.. పోలీసులు నిందితుని మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను ట్రాక్ చేసిన తర్వాత తారాపీత్‌లో లోహోస్సేన్‌ను పట్టుకున్నారు. ఎనిమిది మంది చ‌నిపోయిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిపాలనపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో నిందితుల‌ను తక్షణమే అరెస్టు చేయాలని మమతా ఆదేశించిన తర్వాత ఈ అరెస్టు జ‌రిగింది. నిందితుడు అనరుల్ హొస్సేన్ టీఎంసీ రాంపూర్‌హాట్ బ్లాక్ నం.1 అధ్యక్షుడు.

ఏబీపీ స‌మాచారం ప్ర‌కారం… నిందితుడు సంప‌న్నుడు. ఈయ‌న మొద‌ట్లో చాలా పేద‌వాడు. పొట్ట‌కూటి కోసం తాపీ మేస్త్రీగా ప‌నిచేశాడు. అతను తన కుటుంబంతో ఒక మట్టి ఇంట్లో (మతిర్ బడి) నివసించేవాడు. అయితే 2011 తర్వాత ఆయన ‘అదృష్టం’ మారిపోయింది. కేవలం 6 సంవత్సరాలలో పెద్ద కాంట్రాక్టర్‌గా మారాడు.

Source: OpenIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి