News

ఇమ్రాన్‌ ఖాన్‌కు రూ.50 వేలు జరిమానా!

520views

ఇస్లామాబాద్‌: ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం జాతీయ అసెంబ్లీలో చర్చకు వ‌చ్చి, మరో నాలుగు రోజులలో ఓటింగ్ జరుగబోతుండగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఆయనకు రూ. 50 వేల జరిమానా విధించింది.

కైబర్‌- పఖ్తున్క్వాలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇమ్రాన్‌ ఈ నెల 15న స్వాత్‌ను సందర్శించొద్దని, అక్కడ బహిరంగ సభల్లో పాల్గొనవద్దంటూ ఇసిపి జాటీచేసిన ఆదేశాలను లెక్కచేయకుండా ఇమ్రాన్‌ ఖాన్‌.. స్వాత్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని, ప్రసంగించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి