News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి!

581views
  • శివలింగం, ఇత‌ర విగ్రహాల ధ్వంసం

ల‌క్నో: మరో హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, దోచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా నోయిడా, బెహ్లోల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 20-21 మధ్య రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సచిన్ గుప్తా పోస్ట్ చేసిన వీడియోలో, ఆలయ ప్రాంగణంలో చెల్లాచెదురుగా ఉన్న హిందూ దేవుళ్ళ‌ విగ్రహాల ముక్కలు కనిపించాయి. ఆయన ట్వీట్ చేస్తూ, “సంఘ వ్యతిరేకులు ఆలయంలోకి చొరబడి విగ్రహాలను ధ్వంసం చేశారు. శివలింగం దగ్గర రక్తం కూడా కనిపించింది. ఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు.” అని తెలిపారు.

ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన గుర్తుతెలియని దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తెలెత్తింది. ఏబీపీ జర్నలిస్ట్ అంకిత్ కౌశిక్ పోస్ట్ చేసిన వీడియోలో, శివలింగం భాగాలు ధ్వంసమైనట్టు చూడవచ్చు. గుడి నేలపై కూడా రక్తం చిమ్మినట్టు కనిపించింది.

పోలీస్ కమిషనరేట్ గౌతమ్ బుద్ధ్ నగర్ విభాగం స్పందించింది. “పోలీసు ఫోర్స్ స్పాట్‌లో ఉంది. పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషయమై విచారణ ప్రారంభించి తగిన చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి