News

బెంగాల్‌లో మళ్ళీ హింస.. ఇళ్ళ‌కు నిప్పు, 8 మంది మృతి!

702views

ప‌శ్చిమ బెంగాల్‌: బెంగాల్‌లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్​ జిల్లా రాంపుర్​హట్​ ప్రాంతంలో మంగళవారం కొందరు దుండగులు ఇళ్ళ‌కు నిప్పుపెట్టగా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను ఆర్పివేసినట్టు వివరించారు.

తృణమూల్​ కాంగ్రెస్​ నేత, బర్షాల్​ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్​ బహదూర్​ షేక్​ను సోమవారం ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు. రాంపుర్​హట్​లోని అయిదు ఇళ్ళ‌కు నిప్పుపెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

”ఈరోజు ఉదయం ఒకే ఇంటి నుంచి ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అంతకుముందు 10 మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అది నిజం కాదు. మొత్తం 8 మంది చనిపోయారు.” ​

– మనోజ్​ మాలవీయ, బంగాల్​ డీజీపీ

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి