337
* ఐరాసలో భారత రాయబారి వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్రమే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇరు దేశాల అధినేతలతోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. ఉక్రెయిన్లో నెలకొన్న సంక్షోభంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నిదేశాలకూ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్పటికే 90 టన్నులకు పైగా ఔషధాలు పంపామని, అవసరమైతే ఇంకా సాయం చేస్తామని తెలిపారు.