News

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని నిరసించిన భారత్…

393views

* రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారతీయ న్యాయమూర్తి…

క్రెయిన్ పై రష్యా దురాక్రమణ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో భారతీయ జడ్జి సైతం రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఉక్రెయిన్​పై దండయాత్రకు వ్యతిరేకంగా ఐసీజే తీర్పు చెప్పగా.. భారత్​ నుంచి న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ అందులో భాగమయ్యారు. సైనిక చర్యను నిలిపివేయాలని ఉక్రెయిన్ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన 15 మంది న్యాయమూర్తుల్లో.. 13మంది రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇద్దరు పిటిషన్​ను వ్యతిరేకించారు. ఉక్రెయిన్ ఫిర్యాదును తోసిపుచ్చిన వారిలో రష్యా న్యాయమూర్తి, ఐసీజే ఉపాధ్యక్షుడు కిరిల్ గెవోర్జియన్, చైనా న్యాయమూర్తి షూ హాన్​కిన్​ ఉన్నారు.

తక్షణమే రష్యా దళాలు తమ దాడులను నిలిపివేయాలని ఐసీజే ఆదేశాలిచ్చింది. 1948 జెనోసైడ్‌ కన్వెన్షన్‌ను రష్యా ఉల్లంఘించిందని పేర్కొంది. ఫిబ్రవరి 24న రష్యా సమాఖ్య ప్రారంభించిన సైనిక చర్యను నిలిపివేయాలంటూ తీర్పిచ్చింది. ఈ తీర్పును అమెరికా స్వాగతించింది. రష్యా వెంటనే సైనిక చర్య నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఐసేజీ తీర్పు స్పష్టంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.