News

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కి Y కేటగిరీ సెక్యూరిటీ

468views

న్నాళ్ళూ హిందూత్వానికి, ఆచారాలకు, పద్ధతులకు విరుద్ధమైన, వ్యంగ్యాత్మకమైన, విమర్శాత్మకమైన, అర్థ సత్యాలతో, అసత్యాలతో కూడుకున్న, తప్పుడు, కల్పిత గాథలతో కూడిన సినిమాలెన్నో వచ్చాయ్. ఆ దర్శకులకు, నటీనటులకు, నిర్మాతలకు ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. మహా అయితే అక్కడక్కడా చిన్న చిన్న నిరసనలు ఎదురయ్యేవంతే. వాటిని సదరు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పట్టించుకున్న దాఖలాలు కూడా ఎప్పుడూ లేవు.

కానీ ఇప్పుడు, ఇన్ని దశాబ్దాల తర్వాత కాశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమంపై నిజానిజాలను వెల్లడి చేస్తూ ఓ సినిమా విడుదలైతే… ఆ దర్శక నిర్మాతలకు, నటీనటులకు ఇప్పుడు ఆపద పొంచి ఉంది. వారికి బెదిరింపులు ఎడురవుతున్నాయ్. ముఖ్యంగా ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి. ఆ దర్శకుడికి Y కేటగిరీ భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఎర్పడిందిప్పుడు.

ఆయనకు బెదిరింపు కాల్స్ ఎక్కువవడంతో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి కేంద్రం భద్రత పెంచింది. ఆయనకు Y కేటగిరీ భద్రతతో పాటు దేశవ్యాప్తంగా CRPF సెక్యూరిటీ ఉంటుందని వెల్లడించింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కొన్ని వర్గాలు ఆయనను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో చూపించిన వాస్తవాలను ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.