News

ఈ ఏడాది భారత సైన్యం చేతుల్లో హతమైన ఉగ్రవాదులు 77 మంది

459views

* పార్లమెంటులో వెల్లడించిన ప్రభుత్వం

తేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 77 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 12 మందిని అరెస్ట్ చేశారని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. 2020లో 99 మంది తీవ్రవాదులను అంతం చేయగా.. 19 మందిని అరెస్టు చేశారు. “సరిహద్దు ఆవల నుండి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌లో ఎక్కువగా ఉన్నాయి. భారత్ లో హింసను ప్రేరేపించడానికే వారు చొరబడుతూ ఉన్నారు. సరిహద్దు ఆవల నుండి తీవ్రవాదులకు మద్దతు ఉంది” అని చొరబాట్లపై సభ్యులడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.

2021లో ఉగ్రవాద దాడులలో 42 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 117 మంది గాయపడ్డారని రాయ్ సభకు తెలియజేశారు. 2020వ సంవత్సరంలో 62 మంది భద్రతా సిబ్బంది మరణించగా 106 మంది గాయపడ్డారు. భారతదేశం, పాకిస్థాన్ 2021 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఇండో-పాక్ సరిహద్దుల్లో కాల్పుల సంఘటనలు గణనీయంగా తగ్గాయి. అయితే ఇది చొరబాటుపైనా ప్రభావం చూపుతుందని భావించారు. అయితే, సరిహద్దు గుండా ఉగ్రవాదులను పాక్ భారత్ లోకి పంపిస్తూనే ఉందని భద్రతా వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆర్థిక నిర్వహణలో భాగంగా ప్రాజెక్టుల అమలులో కూడా పారదర్శకత ఉందని, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం అనేక చర్యలు, కార్యక్రమాలను చేపట్టిందని రాయ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.