News

హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన, ఆ పిటిషన్లన్నీ కొట్టివేత!

626views

బెంగ‌ళూరు: కొన్ని నెలలుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్​ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై​​ నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది.

ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్​ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది జస్టిస్​ రీతు రాజ్​ అవస్థి, జస్టిస్​ కృష్ణ దీక్షిత్​, జస్టిస్​ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని, విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది.

పటిష్ఠ భద్రత..

హిజాబ్​పై తీర్పు నేపథ్యంలో కలబురగి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్​ను అమల్లోకి తెచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మార్చి 19 ఉదయం 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. శివమొగ్గలోనూ స్కూళ్లు, కాలేజీలను మూసివేసినట్టు అధికారులు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి