
427views
-
రెట్టింపు స్థాయిలో కేసులు
బీజింగ్: చైనాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.. మంగళవారం రెట్టింపు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కొత్తగా 3,507 కేసులు వెలుగుచూసినట్టు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. వీటిలో ఎక్కువగా ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్లోనే(2,601) వెలుగులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం కంటే 1,337 కేసులు ఎక్కువగా నమోదైనట్టు పేర్కొన్నారు.





