News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… లాక్ డౌన్‌లో ప్రధాన నగరాలు

569views

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్ని రోజులుగా మళ్ళీ వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండటం గత రెండేళ్ళ‌లో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.

మూడు వారాల క్రితం వరకు 100కు దిగువనే ఉన్న కేసుల సంఖ్య కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 1369 కొత్త కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా డజనకు పైగా ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు అక్కడ శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ విధించారు. 90లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో వ్యాపారాలు మూసివేశారు. రవాణాను నిలిపివేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. వైరస్‌ కట్టడిలో భాగంగా నగరమంతా సామూహిక పరీక్షలు చేయనున్నట్టు వెల్లడించారు. షాంఘై, ఇతర నగరాల్లోనూ లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి