
524views
-
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంపైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళు రువ్వారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు. కర్నాల్‌లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద దుండగుల దాడిని మొదట అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనాలపై సుమారు ఐదు-ఆరుగురు మంది వచ్చారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది తమను గుర్తించడం వల్ల నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. దాడి నేపథ్యంలో సీఎం ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.





