News

జమ్ముకశ్మీర్‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు!

608views
  • న‌లుగురు తీవ్రవాదుల హ‌తం

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో జైషే మహ్మద్​ కమాండర్​ కమాల్​ భాయ్​ను హతమార్చినట్టు జమ్ముకశ్మీర్​ పోలీసులు వెల్లడించారు. అతడు 2018 నుంచి ఉగ్ర కార్యకలాపాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

శుక్రవారం రాత్రి.. పుల్వామా, గందర్‌బాల్‌, హంద్వారాలో ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ చెప్పారు. పుల్వామాలో చేప్టటిన ఆపరేషన్‌లో కమాండర్​తో పాటు మరో ముష్కరుడిని మట్టుబెట్టినట్టు తెలిపారు. గంధర్‌బాల్, హంద్వారాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో లష్కరే తొయిబాకు చెందిన మరో ఇద్దరిని హతమార్చినట్టు వివరించారు. మరో ఉగ్రవాదని ప్రాణాలతో పట్టుకున్నట్టు విజయ్‌కుమార్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి