News

ది కశ్మీర్‌ ఫైల్స్ చిత్రానికి అశేష ప్రజాద‌ర‌ణ‌

399views

విజ‌య‌వాడ‌: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’… కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథను దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం. 90వ దశకంలో కశ్మీరీల‌పై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో రూపొందింది ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో పాటే ఓ ఘనతను అందుకుంది.

ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీలో అత్యధిక రేటింగ్​ అందుకున్న చిత్రంగా నిలిచింది. 10/10 రేటింగ్​ను అందుకుంది. కశ్మీర్‌లోని తీవ్రవాదులు, వేర్పాటువాదుల దాడుల వల్ల ఓ సామాజిక వర్గం ఎలా అంతమైందో ఈ సినిమాలో భావోద్వేగభరితంగా చూపించారు. కాగా, ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి