News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎంఐఎం అడ్ర‌స్ గ‌ల్లంతు!

564views

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 100 స్థానాల్లో 99 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2017లో సాధించిన దానితో పోల్చితే ఎక్కువ ఓట్లు వచ్చాయని అసదుద్దీన్ ఒవైసీ ఆనందించాల్సిందే. ఆయన నేతృత్వంలోని పార్టీ ముఖ్యంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో పోటీ చేసినా ఎన్నికల్లో ప్రభావం చూపడంలో ఘోరంగా విఫలమైంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎక్కువ శాతం ముస్లిం జనాభా, ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఎ.ఐఎం.ఐ.ఎం తన అభ్యర్థులను ఎక్కువమందిని నిలబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల నుండి 38 మంది అభ్యర్థులను నిలబెట్టినప్పుడు అభ్యర్థులందరూ దాదాపు డిపాజిట్లు కోల్పోయారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి