
-
హిందూ సంఘాల కార్యకర్తలపై వరుస దాడులు
-
కట్టడి చేయాలని సీఎంకు సూచిన
శివమొగ్గ(కర్ణాటక): శివమొగ్గలో ముస్లిం గూండాల ఆగడాలు మితిమీరాయని వీరిపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కర్ణాటక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ముఖ్యమంత్రికి సూచించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గలో హిందూ కార్యకర్త హర్ష హత్య అనంతరం కూడా వీరి ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు.
బీజేపీ కార్యకర్త సోదరుడిపై కొందరు దాడులకు పాల్పడిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి వాటిని ఇకపై సహించడం సాధ్యం కాదన్నారు. వెంకటేశ్ అనే వ్యక్తిపై కొందరు ముస్లిం గూండాలు దాడికి పాల్పడ్డారని, అనంతరం మృతి ఆయన చెందాడని భావించి పరారయ్యారన్నారు. అయితే వెంకటేశ్ తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు. ముస్లిం గూండాలను నియంత్రించే పనిని స్థానిక ముస్లిం నాయకులు, మతపెద్దలు చేపట్టాలన్నారు. ఒకవేళ హిందువుల్లో ఆగ్రహం పెల్లుబికితే..ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అని భయంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.





