News

పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

563views
  • ధ్రువీకరించిన విదేశాంగశాఖ

న్యూఢిల్లీ:పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ఈ ధ్రువీకరించారు. రమల్లాలోని భారత ప్రతినిధి ముకుల్‌ ఆర్య మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి ట్వీట్ చేశారు. ముకుల్ ఎంతో తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి అని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు.

భారత రాయబారి ముకుల్‌ మృతిపై పాలస్తీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముకుల్‌ మృతి చెందారన్న వార్త తెలియగానే.. ఆ దేశ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌, ప్రధాని మహమ్మద్‌ ష్టాయే అధికారులను అప్రమత్తం చేసిన‌ట్టు అక్క‌డి ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వెంటనే భారత రాయబార కార్యాలయానికి చేరుకొని ఆయన మరణానికి గల కారణాలను నిశిత పరిశీలన చేయాలని ఆదేశించామని పేర్కొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రకాలుగా సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ముకుల్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అక్కడి విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి