
489views
దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంలో పీఎం గతి శక్తి యోజన కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రభుత్వ -ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కావాలని, పెట్టుబడులు పెంచాలని కోరారు.
“వివిధ శాఖల వద్ద అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన వివారాలు లేకపోవడం వల్ల రోడ్డు, రైలు పనుల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. పీఎం గతి శక్తి ద్వారా మౌలిక సదుపాయాల ప్లానింగ్, అమలు, పర్యవేక్షణ సమన్వయంతో జరిగేలా చూడొచ్చు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో గతి శక్తి – జాతీయ మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
ఈశాన్య ప్రాంత సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. రహదారులు, ఆప్టికల్ ఫైబర్ అనుసంధానం, పునరుత్పాదక ఇంధనం వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను పెంచిందని తెలిపారు.





