News

ఉగ్రవాద కుట్ర భగ్నం.. అనుమానిత తీవ్రవాది అరెస్టు

518views

న్యూఢిల్లీ: దేశంలో విధ్వంసానికి తీవ్రవాదులు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల హెచ్చరించింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతను అప్ర మత్తం చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్ళే ఇండిగో విమాన ప్రయాణికుల పాస్‌పోర్టులను ఇమిగ్రేషన్‌ అధికారులు తనిఖీ చేశారు.

రిజ్వాన్‌ ఖాన్‌ (57) అనే వ్యక్తి త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా చిరునామాతో పాస్‌పోర్టు కలిగివున్నాడు. దీంతో ఆయన పాస్‌పోర్టును ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. దీంతో రిజ్వాన్‌ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఈయనకు తీవ్రవాదులతో సంబంధం ఉందా లేదా అనే కోణంలో విచారించేందుకు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి