
-
తొలిసారి స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ను తయారు చేస్తున్న ఇస్రో
న్యూఢిల్లీ: అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు చిన్నచిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను కూడా తయారు చేసింది.
ఈ ఏడాది మార్చి నెలలోనే దీనిని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వంద కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన 6,000 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్టు సమాచారం.
ఆ ఫలితానికి అనుగుణంగా మార్చి 25న పూర్తిస్థాయి ప్రయోగం చేపట్టనున్నారు. ఇప్పటిదాకా ఇస్రో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్3 అనే ఐదు రకాల రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తోంది. తాజాగా వీటి సరసన ఎస్‌ఎస్‌ఎల్‌వీ చేరబోతోంది. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు.





