News

వాయువ్య ఆసియా అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్ ప్రదేశ్: మోడీ వ్యాఖ్య

389views

న్యూఢిల్లీ: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్‌లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు.

‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్‌లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ఇదిలావుండ‌గా, ‘అరుణాచల్‌ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి