News

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు

756views
  • నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తింపు

శివ‌మొగ్గ: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఆదివారం రాత్రి 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. శివమొగ్గలాలో హై అలర్ట్ ప్రకటించారు.

సీగేహట్టి ప్రాంతానికి చెందిన హర్ష పై ఆదివారం రాత్రి 9.30 గంటలకు దాడి జరిగింది. రక్తపు మడుగులో హర్ష ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. సోమవారం ఉదయం భజరంగ్ దళ్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర, ఈ ఘటన దురదృష్టకరమని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

హర్ష హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. మీడియాతో ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్టు భావిస్తున్నామని.. అయితే, వీరి వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదని అన్నారు.

శివమొగ్గ ప్రాంతంలో 1,200 మంది అదనపు పోలీసులను మోహరించారు. బెంగళూరు నుంచి 200 మందికి పైగా పోలీసులను పంపినట్టు ఆయన తెలిపారు. ఏడీజీపీ మురుగన్ కూడా సమస్యను చూస్తున్నారని, శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు.

పబ్లిక్ టీవీలో వచ్చిన కథనం ప్రకారం, నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తించారు. అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం (ఫిబ్రవరి 21) పట్టుకున్నారు. అరెస్టయిన వ్యక్తి నుంచి లభించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆదివారం రాత్రి క్యాంటీన్‌లో టీ తాగుతున్న హర్షపై మరో నలుగురితో కలిసి కారులో వచ్చి దాడి చేసినట్టు దొడ్డపేట పోలీస్‌స్టేషన్‌లో ఖాసీఫ్‌ను విచారించగా అంగీకరించాడు. పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేసిన అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. తదుపరి విచారణ నిమిత్తం మరో ఇద్దరు నిందితులను శివమొగ్గ నుంచి బయటకు తీసుకెళ్ళారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి