
589views
కోలార్(కర్ణాటక): గోకుంటె గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణ యంత్రాంగం కూల్చివేసింది. ముల్బాగల్ తహశీల్దార్ శోభితా ఆర్ ఆదేశాల మేరకు తాలూకా అధికారులు 20 అడుగుల అక్రమ జీసస్ విగ్రహాన్ని కూల్చివేయించారు. పశువులను మేపేందుకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించారని అధికారులు తెలిపారు.
సోమవారం వందలాది మంది పోలీసులతో అధికారులు గోకుంటెకు వచ్చారు. విగ్రహాన్ని తీసివేయడాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకించినప్పటికీ తెల్లవారుజామున మూడు గంటలకు కూల్చివేశారు. ఆ విగ్రహాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించిందని శోభిత తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని కూల్చివేశామని చెప్పారు. కూల్చివేత ఉత్తర్వు మార్చి 2021లో జారీ అయిందన్నారు.
Source: NationalistHub





