
567views
-
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందని చెప్పారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు.
బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపై కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన వెబినార్లో ప్రసంగించిన మోదీ.. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్టు తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం.. విద్యా రంగంలో అపూర్వ ఘట్టమని అభివర్ణించారు.
Source: EtvBharat





