News

రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

524views

శ్రీ‌శైలం: శ్రీశైలం శివరాత్రికి ముస్తాబైంది. రేపటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి స్వామి అమ్మ‌వార్లకు వాహ‌న సేవ‌లు, గ్రామోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఉత్స‌వాల్లో భాగంగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా కరోనా నిబంధనలను పాటించేలా.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మార్చి నాలుగో తేదీ వరకూ 11 రోజుల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రికి, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులు దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

ఈ నెల 22 నుంచి మార్చి నాలుగోతేదీ వరకు మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో లవన్న సూచించారు. ఆన్ లైన్ లో రూ. 200 శీఘ్రదర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు రోజులు ఐదు వేలు అందుబాటులో ఉండగా.. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రెండు వేలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి