
-
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ పేరిట తప్పుడు వార్తలు
లక్నో: దారుల్ ఉలూమ్ దేవబంద్ పూర్వవిద్యార్థి షమ్స్ తబ్రేజ్ ఖాస్మీ స్థాపించిన ఇస్లామిక్ ప్రచార వెబ్‌సైట్ మిల్లత్‌కు పైత్యం పెరిగిపోయింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పేరుతో బుధవారం (ఫిబ్రవరి 16) నకిలీ వార్తలను ప్రచురించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి రెండు దశల్లో జరిగిన ఓటింగ్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పేలవమైన పనితీరు కనబరిచిందని, దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు మిల్లత్ టైమ్స్ ప్రచురించింది. ఐబి నివేదికపై సర్ సంఘచాలక్ కూడా మాట్లాడారని పేర్కొంది. నిజానికి అటువంటి సమావేశం జరగలేదు. ఇది కేవలం నకిలీ వార్త.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల గురించి స్వార్థపరులు రకరకాల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు వ్యాప్తి చేయడానికి వారి ప్రచార యంత్రాంగం రాత్రిపూట అష్టకష్టాలు పడింది.
Source: Organiser





