News

ఈడీ కస్టడీలోకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్!

603views

ముంబై: దావూద్ ఇబ్రహీంపై న‌మోదైన మనీలాండరింగ్ కేసు నేప‌థ్యంలో ఆయ‌న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను శుక్రవారం 24 ఫిబ్రవరి 2022 వరకు ఈడీ కస్టడీకి పంపారు. దోపిడీ కేసులో కస్కర్‌ను థానే జైలులో ఉంచారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ముంబై అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉన్న హవాలా, దోపిడీ, అక్రమ ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం మనీలాండరింగ్ నిరోధక సంస్థ వెతుకుతోంది.

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో ప్రమేయం ఉన్నందుకు దావూద్ ఇబ్రహీం, అతని సహాయకులపై ఇడి ఇటీవల మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని సహాయకులు, ముఠా సభ్యులను ఈడీ ఇప్పుడు విచారించనుంది. ఇక్బాల్ కస్కర్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ఇడి చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు ఆమోదించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి