News

ఆడ దూడపై అత్యాచారం.. నిప్పులు చెరిగిన ప్రజలు

553views

రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆడ దూడను క్రూరంగా హింసించి, అత్యాచారం చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో నలుగురు నిందితులు జుబైర్, తలీమ్, వారిస్, చునాలను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు రోడ్డుపై ఉన్న దూడపై అత్యాచారం చేయగా, మరో నిందితుడు ఆ దూడ శబ్దం చేయకుండా అడ్డుకోవడం వైరల్ వీడియోలో ఉంది. ఘటన జరిగిన సమయంలో కొంద‌రు వ్యక్తులు అక్కడే ఉన్నారు.

వారిలో ఒకరు ఈ చర్యను చిత్రీకరించారని ఆరోపించారు. ఫతే మహమ్మద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అల్వార్ జిల్లాలోని చోపంకిలోని కొండ ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. మేవాత్ కిందకు తిజారా ఫాల్స్ ప్రాంతం వస్తుంది. ఇదే ప్రాంతంలో ఆవుల అక్రమ రవాణా, స్మగ్లర్లపై పోలీసుల ఎన్‌కౌంటర్లు వంటివి గతంలో చోటు చేసుకున్నాయి.

“నిందితులందరూ 20-22 ఏళ్ల మధ్య వయసున్న వారు. నిందితుల్లో ఒకరు అసహజ చర్యకు పాల్పడ్డారు, మరొకరు దూడను పట్టుకున్నారు. మరో నిందితుడు ఈ చర్యను చిత్రీకరించాడు. నాలుగో నిందితుడు ఈ దారుణం చోటు చేసుకుంటున్నప్పుడు అక్కడే ఉన్నాడు” అని అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శంతను కె సింగ్ చెప్పారు.

ఆగ్రహం-నిరసన

ఈ ఘటన జిల్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బుధవారం, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని తిజారాలో అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాదయాత్ర నిర్వహించి, ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి మెమోరాండం అందజేశారు. “ఈ కిరాతక చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నిందితులకు ఉరి శిక్ష విధించాలి’’ అని తిజారాలోని జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి