
568views
న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత్- ఉక్రెయిన్ మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించాయి.
భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఉక్రెయిన్‌లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు స్వదేశానికి రావాల్సిందిగా భారత రాయబార కార్యాలయం నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది.
Source: EtvBharat





