
526views
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్య అనంతరం బంగారు నగలు దోచుకున్నాడు. ఘటన సమయంలో అడ్డొచ్చిన మరో మహిళపైనా నిందితుడు క్రూరంగా దాడి చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఉపాధ్యాయురాలి పరిశీలించారు. దోపిడీ కోసమే హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమించారు. అసాధారణ రీతిలో జిల్లా పోలీసు యంత్రాంగం అంతా దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 90 రోజుల పాటు శ్రమించి.. చివరకు నిందితుడు ఎవరో గుర్తించారు. కర్నాటకలోని దేవెనహళ్లికి చెందిన షఫీవుల్లాగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Source: Tv9





