
జమ్మూ, కాశ్మీర్: కాశ్మీర్ లోయలోని వివిధ ప్రదేశాలలో పది మంది జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను రాష్ట్ర దర్యాప్తు సంస్థట(ఎస్.ఐ.ఏ)అరెస్టు చేసింది. ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సంబంధం ఉన్న నేరాలను పరిశోధించడానికి ఎస్.ఐ.ఏ ఇటీవల ఏర్పాటైంది. మధ్య కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లోని 10 వేర్వేరు ప్రదేశాలలో జెఎమ్ నెట్‌వర్క్‌పై దృష్టి సారించి, ఎస్.ఐ.ఏ రాత్రిపూట దాడులు నిర్వహించిందని దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.
దక్షిణ, మధ్య కాశ్మీర్‌లో ఆయుధాలను రవాణా చేయడానికి ఆర్థిక సహాయం, ఇతర లాజిస్టిక్ మద్దతుతో పాటు యువతను రిక్రూట్ చేయడంలో ఉగ్రవాద మాడ్యూల్ చురుకుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎస్.ఐ.ఏ సోదాల్లో సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, బ్యాంకింగ్ ఛానెళ్ల వినియోగానికి సంబంధించిన రికార్డులు, డమ్మీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
అరెస్టయిన ఉగ్రవాదుల్లో ఎక్కువగా పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులే ఉన్నారని అధికారులు తెలిపారు. వీరంతా సాధారణ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
Source: Organiser





