News

నేటి నుండి మేడారం జాతర!

446views

భాగ్య‌న‌గ‌రం: `తెలంగాణ కుంభమేళా’గా భావించే ములుగు జిల్లా మేడారం మహాజాతర నేడే ప్రారంభం కానున్నది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో కొన్ని రోజులుగా మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులకు చీర, సారె, ఇచ్చి పసుపు కుంకాలు పెట్టి భక్తులు అమ్మవార్లకు పెద్ద ఎత్తున బంగారం సమర్పించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ ఏది అంటే ముందుగా వినిపించే పేరు మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. దేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పూర్వపు వరంగల్ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తొలినాళ్లలో ఈ జాతరను ప్రధానంగా గిరిజనులు జరుపుకొనేవారు.. రాను రాను అమ్మవార్ల మహిమలు తెలిసి అందరూ కొలిచి, మొక్కుతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి