
663views
ఉడిపి: హిజాబ్ ధరించి ఉడిపి కాలేజీకి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించిన ఉడిపి బీజేపీ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఉడిపి బీజేపీ ఎంఎల్‌ఏ కె. రఘుపతి భట్ , మైనారిటీ మోర్చా అధ్యక్షుడు దావూద్ అబూబకర్ ఆ విధంగా బెదిరింపు కాల్స్ అందుకున్నవారిలో ఉన్నారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తిన ఉడిపిలోని ప్రీయూనివర్శిటీ మహిళా కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఉన్న భట్ శుక్రవారం ఉడిపిలో విలేఖరులతో మాట్లాడారు. తనకు వచ్చిన కాల్స్ చాలా వరకు విదేశాల నుంచి వచ్చిన ఇంటర్నెట్ కాల్స్ అని తెలిపారు. తనకు కాల్ చేసిన వ్యక్తులు ప్రాణాలు తీస్తామని బెదిరించారని, ఇది తనకు కొత్తేమి కాదని ఆ బీజేపీ ఎంఎల్‌ఏ అన్నారు. హిజాబ్ విషయంలో మరింత గట్టిగా మాట్లాడితే టార్గెట్ చేస్తామని కూడా వారు హెచ్చరించారన్నారు.
Source: Nijamtoday





